జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్కు చెందిన నర్సమ్మకు 93 ఏళ్లు. ఇటీవలె ఆమె కరోనా బారిన పడింది. మహమ్మారి సోకినందుకు ఆమె భయపడలేదు. ధైర్యంగా దానిని ఎదురించేందుకు పూనుకుంది.
హోం క్వారంటైన్లోనే ఉంటూ... పౌష్ఠికాహారం తీసుకుంది. మళ్లీ పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా వచ్చినా ఆరోగ్యంగానే ఉన్నానని బామ్మ తెలిపింది. మనోధైర్యంతోనే కరోనా నుంచి త్వరగా కోలుకుంటామంటోంది నర్సమ్మ.
ఇదీ చూడండి: రోగుల అవస్థలు.. వైద్యమందక చిన్నారి మృతి