రెస్టారెంట్ నిర్వాహకులు, వినియోగదారులకు ఆహార సరఫరా కోసం ప్రత్యామ్నాయంగా యమ్జీ (Yumzy) యాప్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న లాల్సా కంపెనీ దీన్ని రూపొందించింది. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి నాణ్యమైన ఆహారపదార్థాలను వినియోగదారులకు అందించేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్టు సంస్థ సీఈవో సురేష్ తెలిపారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో రెస్టారెంట్ నిర్వాహకులు, వినియోగదారులకు యమ్జీ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ నాలుగు ప్రధాన నగరాల్లో దాదాపు 6 వేల లెజెండ్స్‌తో కలిసి పనిచేస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి : నిమ్స్‌లో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్... ఒక్కొక్కరికి మూడు డోసులు