YSR STAMP ON EGGS: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కోడిగుడ్డుపై వివిధ రకాల స్టాంపులు వేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లపై వైఎస్సార్ ఎస్పీ అని స్టాంప్ వేశారు. మామూలుగా బాలింతలు, చిన్నారులు, విద్యార్థులకు పంపిణీ చేసే గుడ్లకు.. మార్కెట్లో దొరికే వాటికి తేడా తెలిసేందుకు ఈ విధంగా స్టాంప్ వేస్తారు.
కానీ ప్రభుత్వం మాత్రం మరి కొంచెం ఆలోచించి.. వైఎస్సార్ ఎస్పీ పేరుతో ఉన్న గుడ్లను విద్యార్థులకు అందించారు. వైఎస్సార్ తాత పేరు కూడా గుర్తించుకోవాలని జగన్ మామ ఈ కోడిగుడ్లు ఇచ్చారేమో అని పిల్లలు అనుకుంటున్నారు.
ఇవీ చదవండి: 'కొత్త వేరియంట్ ప్రభావం తక్కువే.. ముందు జాగ్రత్తే ముఖ్యం'