ETV Bharat / state

YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్‌.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి.. - YS Sharmila challengs kcr give seats for sittings

YS Sharmila Comments on KCR : దమ్ముంటే సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని కేసీఆర్‌కు.. వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఉలిక్కిపడుతున్నారని షర్మిల ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు.

Ys Sharmila
Ys Sharmila
author img

By

Published : Jul 23, 2023, 8:08 PM IST

YS Sharmila Fires on BRS : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్.. సిట్టింగులకే సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని.. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ మొదటిసారి ఉద్యమ సెంటిమెంట్‌తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని.. తెలంగాణ ఆత్మగౌరవంతో రెండోసారి కుర్చీని కాపాడుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల నుంచి అవినీతి ఏరులై పారించి.. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు కట్టబెట్టి.. ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారని వైఎస్ షర్మిల ట్విటర్‌లో మండిపడ్డారు.

YS Sharmila Tweet Today : ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న కేసీఆర్.. ఉలిక్కిపడుతున్నారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. సిట్టింగ్‌లకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నారని ఆక్షేపించారు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను గట్టెక్కలేనని సీఎం తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి.. వైఎస్‌ఆర్‌టీపీ సవాల్ విసురుతోందని చెప్పారు. బీఆర్ఎస్‌ది అవినీతిరహిత పాలనే అయితే.. ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఎన్నికల మ్యానిఫెస్టోకి న్యాయం చేసిన వారయితే.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవండని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

  • ఉద్యమ సెంటిమెంట్ తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దొర గారు.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు. తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు. కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు…

    — YS Sharmila (@realyssharmila) July 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

YS Sharmila Comments on KCR : ఇటీవలే సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​పై వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగే టీఎస్​ఆర్టీసీ బస్సు మొదలుకొని మంత్రులు, ఎమ్యెల్యేలు తెలంగాణ వాహనాలతో.. మహారాష్ట్రలో ఎలా తిరుగుతారని ఆమె ప్రశ్నించారు. మహారాష్ట్రలో మంత్రులు తిరిగే వాహనాలు రాష్ట్ర ఆస్తులని.. ఇది ప్రజల కష్టార్జితమని పేర్కొన్నారు. ప్రజల పన్నుల మీద కొనుగోలు చేసే వాహనాలను.. ఏ నైతికతతో ఆ రాష్ట్రంలో నడుపుతారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు.

ఈ తొమ్మిది సంవత్సరాలలో రూ.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా.. తెలంగాణను మార్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షన్నర కోట్ల కమిషన్లు తీసుకున్నారని ఆక్షేపించారు. గ్రానైట్, భూములు, ఇసుక, గనులు అడ్డగోలుగా దోచుకున్నారని దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ నేతలను.. బందిపోటు రాక్షస సమితి నాయకులుగా అభివర్ణించారు. చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ కమీషన్లు తీసుకుంటున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

YS Sharmila Fires on BRS : కానీ ఇప్పుడు బీఆర్​ఎస్​ నాయకులు.. తమ గొప్పల కోసం తెలంగాణ ఆస్తులను.. పక్క రాష్ట్రంలో వాడుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అధికార పార్టీ​ నేతలకు నీతి ఉంటే రాష్ట్ర వాహనాలను సరిహద్దులో వదిలి.. మహారాష్ట్ర వాహనాలల్లో తిరగాలని హితవు పలికారు. కేసీఆర్​ రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిరాకరించారని పేర్కొన్నారు. భారత్‌ రాష్ట్ర సమితి ఆటలు కట్టించడానికి ప్రజలు ఓటుతో సిద్ధంగా ఉన్నారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: YS Sharmila Questioning KCR Corruption : 'బీఆర్​ఎస్​తో పొత్తు ఉండదు.. కేసీఆర్​ అవినీతి ఎంతో తెలుసా?​'

YS Sharmila Meest DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో వైఎస్ షర్మిల భేటీ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.