Chain Snatching in Kukatpally : హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ ఫార్మా కంపెనీలోని సెక్యూరిటీ గార్డును కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రావు ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొట్టి సాయిరాం అనే వ్యక్తి నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్లో ఓ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు.
గొలుసు కొట్టేసి, తాకట్టు పెట్టి : ఈనెల జనవరి 3 వ తేదీన బాలాజీ నగర్లో ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాన్ని నిందితుడు సాయిరాం చోరీ చేసాడు. అదే రోజు ఆ వాహనాన్ని ఉపయోగించి వివేకానంద నగర్ కాలనీలో శ్వేతా అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేసి పరారయ్యాడు. చోరీ చేసిన గొలుసును ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు.
శ్రమించి పట్టుకున్న పోలీసులు : బాధితురాలు శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు సుమారుగా 180 సీసీ ఫుటేజీలను పరిశీలించి నేరస్థుడిని గుర్తించారు. ద్విచక్ర వాహనాన్ని చోరీ చేయడంతో పాటు గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కొట్టి సాయిరాం అనే నిర్దారించుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముత్తూట్ ఫైనాన్స్‌కు నోటీసులు జారీచేశారు. కొట్టి సాయిరాం దొంగిలించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ముదినేపల్లిలో 5 వాహనాల చోరీ కేసులలో ప్రత్యక్షంగా ఉన్నాడని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.
యూట్యూబ్‌లో చూసి దొంగతనం : పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన వివరాలను తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ దొంగతనాలను నిందితుడు ఎలా చేయ్యాలి అనే విషయాలను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నట్లు వారికి వివరించాడు.
Chain Snatching At Hayatnagar : ఒంటరిగా షాప్‌కు వెళ్లితే.. పుస్తెలతాడు చోరీ