YS Sharmila: మనమంతా వైఎస్సార్ వారసులమని.. సువర్ణ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్ పాలనలో ఖాళీగా ఉన్న భూములు, చెరువులను కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ డివిజన్ నాయకులతో షర్మిల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి వారికోసం పోరాడాలని షర్మిల తెలిపారు. అందరం కలిసి చేయి చేయి కలిపితేనే రాజన్న పాలన సాధ్యమవుతుందన్నారు. వైఎస్ హయాంలో పనిచేసిన నాయకులను మరిచిపోనని.. అలాగే కొత్త వాళ్లను ఆహ్వానించాలని స్పష్టం చేశారు. నగరంలోని కార్యకర్తలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలన్నారు.
అదే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం..
వైఎస్సార్ సువర్ణ పాలనను మళ్లీ తీసుకురావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ఎన్నో మాటలు చెప్పారు కేసీఆర్.. అవన్నీ ఏమయ్యాయి. ట్యాంక్‌బండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహమన్నారు..ఏర్పాటు చేశారా?. నగరమంతా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తానన్నారు.. తీసుకొచ్చారా?. వైఎస్సార్ హయాంలో రాజీవ్ గృహకల్ప ద్వారా పేదలకు ఇళ్లను నిర్మించాలని చూశారు.. కానీ ఆ భూములను అమ్మాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి వారికోసం పోరాడాలి.
-వైఎస్ షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఇదీ చదవండి: