ETV Bharat / state

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన యూట్యూబ్​ స్టార్​ షణ్ముఖ్​.. - shanmukh jashwanth new house

యూట్యూబ్​ స్టార్​ షణ్ముఖ్​ జశ్వంత్ క్రేజ్​ అంతా ఇంతా కాదు. తన నటనతో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా షణ్ముఖ్​ హైదరాబాద్​లో ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశం కూడా చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్​ మీడియా ద్వారా షేర్​ చేసుకున్నాడు.

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన యూట్యూబ్​ స్టార్​ షణ్ముఖ్​..

author img

By

Published : Feb 9, 2022, 10:46 AM IST

యూట్యూబ్​ స్టార్​ షణ్ముఖ్​ జశ్వంత్​ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి వెబ్​ సిరీస్​ కోసం చాలా మంది వేచిచూస్తారంటే అతిశయోక్తి లేదు. ఈ ఫాలోయింగ్​తోనే బిగ్​బాస్​ సీజన్​-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్​ ఫేవరెట్​ బరిలోకి దిగినా రన్నరప్​గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా షణ్ముఖ్​ హైదరాబాద్​లో ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశం కూడా చేశాడు. నటి, ఛాయ్​ బిస్కెట్​ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్​ మీడియా ద్వారా షేర్​ చేసుకున్నాడు. దీంతో షణ్నూకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొంత ఇంటితో పాటు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలంటూ షణ్నూ అభిమానులు కామెంట్స్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.