ఏపీ, విశాఖ జిల్లాలో జరుగుతోన్న ఎన్నికల నేపథ్యంలో.. తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. చోడవరం మండలం గంధవరంలో ఇరు వర్గాలు.. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు.
గాయాపడ్డ గంధవరం సర్పంచ్ ఇంద్రజతో సహా క్షతగాత్రులను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: కాలువ ప్రమాదం.. 25 గేదెలు మృతి