BC PRESIDENT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారని వైసీపీ నేత, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ఘాటుగా విమర్శించారు. రాజకీయ వ్యభిచారి ఆర్.కృష్ణయ్యకి రాజ్యసభ సీటుని ఎలా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019లో బీసీలందరూ సమష్టిగా జగన్ని గెలిపించామన్నారు.
ఏపీలోని బీసీలకు న్యాయం జరగకుండా.. ఇక్కడ ఓటు హక్కేలేని కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఓటు వేస్తే గెలిచారా? లేక తెలంగాణ ప్రజలు ఓటు వేస్తే గెలిచారా? అని జగన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో పరిపాలన చేసేందుకు బీసీలు లేరా? లేక జగన్కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వివిధ కులాలు కలిగిన బీసీలను విస్మరించడం అన్యాయం అని అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.