ETV Bharat / state

తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్​ - యాదవ్ హక్కుల పోరాట సమితి

ఇటీవల భాజపా ప్రకటించిన పదవుల్లో రాష్ట్రంలోని యాదవులకు సముచిత స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ... యాదవ్ హక్కుల పోరాట సమితి ఆందోళన బాటబట్టింది. నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు.

yadava porata samithi protest in front of bjp office nampally hyderabad
తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్​
author img

By

Published : Aug 8, 2020, 4:26 PM IST

భాజపా బలోపేతానికి కృషి చేస్తున్న యాదవులను పార్టీ విస్మరించడం అన్యాయని యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ పేర్కొన్నారు. సత్యాగ్రహ దీక్ష పేరుతో రాములు యాదవ్ ఆధ్వర్యంలో... నాంపల్లిలోని భాజపా కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్​కు తరలించారు.

బీసీ కులానికి చెందిన బండి సంజయ్... జిల్లా అధ్యక్షులు, రాష్ట్రస్థాయి పదవుల్లో యాదవులకు ఒక్కరికీ ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని సమితి జాతీయ అధ్యక్షుడు ఖండించారు. తక్షణమే భాజపా అధిష్ఠానం జోక్యం చేసుకుని వివిధ పదవులు, 2023లో జరిగే ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని... లేనిపక్షంలో బండి సంజయ్​ని రాష్ట్రంలో తిరిగనివ్వబోమని రాములు యాదవ్ హెచ్చరించారు.

ఇదీ చూడండి : యూఎన్‌డీపీలో వరంగల్ ఎంపిక.. వ్యర్థాల శుద్ధీకరణకు మొగ్గు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.