ETV Bharat / state

'బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది' - హైదరాబాద్ తాజా సమాచారం

ఖమ్మం జిల్లాలో హత్యాచారయత్నానికి గురై హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న బాలికను స్త్రీ శిశు సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ పద్మజ పరామర్శించారు. బాధితురాలి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.

Women and Child welfare additional director visits rainbow hospital in banjarahills
' బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'
author img

By

Published : Oct 11, 2020, 10:57 PM IST

ఖమ్మం జిల్లాలో హత్యాచారయత్నానికి గురైన బాలికను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్త్రీ శిశు సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ పద్మజ అన్నారు. బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేట్​ చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆమె పరామర్శించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని పద్మజ వెల్లడించారు.

ఇదీ చూడండి:'ఆడవాళ్లపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా.. ప్రభుత్వంలో చలనం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.