నవంబరులో ఓరోజు భర్తకు టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు గాఢనిద్రలోకి జారుకున్నాక ఫయాజ్‌ఖాన్ అతని స్నేహితులతో కలిసి గొంతు నొక్కి హత్యచేసింది. చనిపోయాడని నిర్ధరించుకున్నాక ఎక్కడివాళ్లక్కడికి వెళ్లిపోయారు. తెల్లారాక తన భర్త గుండెపోటుతో మృతిచెందారని అందరిని నమ్మించింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
అన్న మృతిపై అనుమానమొచ్చిన బాబా ఖాన్ సోదరుడు బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు చేశారు. జాహిదా, ఫయాజ్ ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు సహకరించిన అతని స్నేహితులను అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.