ETV Bharat / state

'కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎల్​ఆర్​ఎస్​ ఏమిటి ' - Bjp leader Konan Shanker Reddy on Lrs News today

ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ను తక్షణమే రద్దు చేయాలి భాజపా రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ సర్కార్ సుమారు 6 వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలనే ఆలోచనతో ఉందని ఆయన మండిపడ్డారు.

'కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎల్​ఆర్​ఎస్​ ఏమిటి '

author img

By

Published : Sep 14, 2020, 3:09 PM IST

ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పిండుకోవాలని చూస్తోందని భాజపా రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 6 వేల కోట్ల రూపాయల వసూలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన మండిపడ్డారు. భూ క్రమబద్ధీకరణను తక్షణమే రద్దు చేయాలని శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

అసలే ఇబ్బందులతో..

కరోనా నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వారిపై ఎల్​ఆర్ఎస్ పేరిట మరింత భారం మోపవద్దని కోరారు. తెరాస ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని ఆయన ప్రశ్నించారు.

దగా చేస్తున్నారు : కొలన్

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి దగా చేస్తున్నారని సీఎం కేసీఆర్​ను దుయ్యబట్టారు. తెరాస ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.

ఇవీ చూడండి : 'ప్రభుత్వం మీద భారమున్నా... నెల నెల డబ్బులిచ్చాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.