బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. కర్ణాటక నుంచి తెలంగాణ దాకా... 900 మీటర్ల ఎత్తు వరకు ఉపరితర ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు లక్ష్యదీవుల ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 266 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా వెలగనూరులో 54.8, అనంతసాగర్లో 53.3, అల్మాయిపేటలో 39.8, పాతూరులో 39 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి