ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురుస్తాయన్నారు. లక్షదీవులు నుంచి కోస్తాంధ్ర వరకు గల ఉపరితల ఆవర్తనం బలహీనపడిందన్నారు. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
మాదాపూర్, హైటెక్‌సిటీలో భారీ వర్షం
శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు ప్రధాన రహదారులపైకి చేరి చెరువులను తలపించాయి. వర్షపునీటిలో కొన్ని ద్విచక్రవాహనాలు మునిగిపోయాయి. వరదనీటిలో కార్ల చక్రాలు సగం వరకు మునిగినప్పటికీ వాహనదారులు అలాగే తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు గొడుగుల సాయంతో విధులు నిర్వహిస్తూ వాహనదారులకు సహకారం అందించారు.
ఇదీ చదవండిః హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్