ETV Bharat / state

తేమ గాలుల ప్రభావంతో.. వర్షాలకు అవకాశం

ఆగ్నేయ భారతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నందున ఇవాళ అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు పడే అవకాశముంది. మంగళవారం గిన్నెదారిలో అత్యల్పంగా 13.2 డిగ్రీలుండగా పగలు అత్యధికంగా రామగుండంలో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

weather reports in telangana on Wednesday
తేమ గాలుల ప్రభావంతో.. వర్షాలకు అవకాశం
author img

By

Published : Jan 8, 2020, 5:19 AM IST

ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. బుధవారం అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం 6 చోట్ల స్వల్పంగా వర్షం పడింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. తేమగాలులు వస్తున్నందున ఆకాశం మేఘావృతమై ఉంటోంది. మేఘాలుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గవు.

మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 13.2, ఆదిలాబాద్​లో 14.2, మెదక్​లో 15, రామగుండంలో 18, హైదరాబాద్​లో 19.5 డిగ్రీలుంది. రెండు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి సాధారణం కన్నా 4-5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత పెరగడంతో చలి తీవ్రత కాస్త తగ్గింది. మంగళవారం పగలు హైదరాబాద్​లో అత్యధికంగా 27.3, రామగుండంలో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. బుధవారం అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం 6 చోట్ల స్వల్పంగా వర్షం పడింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. తేమగాలులు వస్తున్నందున ఆకాశం మేఘావృతమై ఉంటోంది. మేఘాలుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గవు.

మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 13.2, ఆదిలాబాద్​లో 14.2, మెదక్​లో 15, రామగుండంలో 18, హైదరాబాద్​లో 19.5 డిగ్రీలుంది. రెండు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి సాధారణం కన్నా 4-5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత పెరగడంతో చలి తీవ్రత కాస్త తగ్గింది. మంగళవారం పగలు హైదరాబాద్​లో అత్యధికంగా 27.3, రామగుండంలో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదీ చదవండిః పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల

08-01-2020 TG_HYD_04_08_ONION_CRISIS_MIDDLE_MEN_PKG_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) ఉల్లి మార్కెట్‌లో దళారులదే రాజ్యం. ఉల్లి సంక్షోభం నేపథ్యంలో విదేశాల నుంచి కేంద్రం గడ్డ తెప్పిస్తే... తొలుత కొంటామన్న రాష్ట్రాలు ఇప్పుడు వెనక్కి తగ్గాయి. దేశంలో... ప్రత్యేకించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సంప్రదాయంగా సాగు చేసే రైతులు ఉల్లి పంట సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గడమే తాజా పరిస్థితికి కారణమని తేలింది. తెలంగాణలో కూడా సాగు విస్తీర్ణం తగ్గిందని ఉద్యాన శాఖ కేంద్రానికి నివేదించింది. వారం పది రోజులుగా ఉల్లిగడ్డ ధరలు దిగి రావడంతో... ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డల కొనుగోళ్లపై వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. LOOK........... VOICE OVER - 1 ఉల్లిగడ్డ మార్కెట్లను దళారులే శాసిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధ్యయనంలో గుర్తించింది. రైతులు, వినియోగదారులకు మధ్య కమీషన్ల కోసం దళారులు సాగిస్తున్న దందాల వల్లనే ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. గత నాలుగేళ్ళలో ఎన్నడూ లేనింత స్థాయిలో ధరలు పెరగడానికి దళారులు, ప్రతికూల వాతావరణంతో పంట దిగుబడి, సాగు, విస్తీర్ణం పడిపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టం చేసింది. దళారులు అక్రమంగా నిల్వలు పెడుతున్నారు. అన్నదాతల పేరిట కొందరు అక్రమంగా అమ్మకాలు సాగిస్తూ... నిల్వ చేస్తున్నారు. ఒకదశలో వినియోగదారులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళనలు దిగాల్సిన పరిస్థితులు దాపురించడం గమనార్హం. ఈ ధరలను నియంత్రించాలంటే ఈ దళారీ, అక్రమ నిల్వల వ్యవస్థను నియంత్రించాలని ప్రభుత్వానికి తాజా నివేదికలో సిఫారసు చేసింది. ధరల పెరుగుదలకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే చిల్లర మార్కెట్‌లో లభ్యత పెరుగుతుంది. దేశంలో గత నవంబరు నుంచి ఉల్లిగడ్డ కిలో ధర విపరీతంగా పెరిగి కిలో 100 నుంచి 160 రూపాయలకు చేరవ కావడంతో కేంద్రం... విదేశాల నుంచి 14 టెండర్ల ద్వారా 41,950 టన్నులు తెప్పించింది. ఈజిప్ట్‌, టర్కీ దేశాల నుంచి ఇవి ముంబయి నౌకాశ్రయానికి 10 రోజుల కిందట చేరాయి. కానీ, టెండర్లు పిలిచేనాటికి మార్కెట్‌లో ఉన్న చిల్లర ధరలు ఇప్పుడు 40 శాతం దాకా తగ్గాయి. హైదరాబాద్‌ నగర చిల్లర మార్కెట్లలో కిలో ధర 50 నుంచి 60 రూపాయల వరకూ పలుకుతోంది. కేంద్రం తెప్పిస్తే కొంటామని తొలుత చెప్పిన రాష్ట్రాలు ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి లేదని కొనడానికి ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తెప్పించిన సరుకులో ప్రస్తుతం 14,309 టన్నులే రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు, దిగుమతులపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి మంగళవారం సమీక్ష చేశారు. విదేశాల నుంచి వచ్చిన సరుకు తీసుకుని ప్రజలకు విక్రయించాలని రాష్ట్రాలకు సూచించారు. ఏడాది క్రితం జాతీయ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిగడ్డ టోకు ధర 1312.19 రూపాయలు ఉండగా... అంతకన్నా 381.69 శాతం పెరిగి 8898.65 రూపాయలకు చేరింది. VOICE OVER - 2 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి కొతర దృష్ట్యా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాకు 41 వేల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 4 వేల మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 400 మెట్రిక్ టన్నులు కేటాయించింది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్‌ ప్రాతిపదిన ఈ కేటాయించిలు చేసింది. అన్ని రాష్ట్రాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ధరలకు 49 నుంచి 58 రూపాయల వరకు ఉల్లి సరఫరా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ముంబయి నౌకాశ్రయంలో దిగుమతైన సరుకును ఆయా రాష్ట్రాలకు తరలించేందుకు రవాణా ఖర్చులను కూడా కేంద్రమే భరిస్తున్నందున రాష్ట్రాలు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీ నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర కిలో 50 రూపాయలు పైగా ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఇదే అత్యల్ప ధర. అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా కేజీ ధర 150 రూపాయలు పలికిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఉల్లిగడ్డ అధికంగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు రావడం వల్ల ఉల్లి ఉత్పత్తి తగ్గిన విషయం విదితమే. ఫలితంగా మార్కెట్‌లో 50 శాతం కొరత ఏర్పడింది. జనవరిలో 39 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి విదేశాల నుంచి రానుంది. రాష్ట్రాల నుంచి 33,139 మెట్రిక్ టన్నుల డిమాండ్ వచ్చిందని... తద్వారా చాలా రాష్ట్రాలు దాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రాల తాజా డిమాండ్ 14,309 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని పేర్కొన్నారు. FINAL VOICE OVER తెలంగాణలో గత జూన్‌ - సెప్టెంబరులో 5299 హెక్టార్లుకుగాను 2073 హెక్టార్లలోనే ఉల్లి పంట సాగైంది. ప్రస్తుత రబీలో సైతం సాగు విస్తీర్ణం 50 శాతం పడిపోయింది. రబీలో దేశంలో పండే పంటలో 50 శాతం దిగుబడి జూన్‌ చివరికల్లా వాడేస్తున్నారు. మిగిలిన సగంలో ఎగుమతులు పోగా నిల్వలో మిగిలిన సరుకు దళారులు, వ్యాపారులు ధరలు పెంచేసి చిల్లర మార్కెట్లను శాసిస్తున్నారు. అధిక విస్తీర్ణంలో సాగు చేయించడం, దళారీ వ్యస్థను దెబ్బతీయడం, నిల్వకు మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా మార్కెట్లను నియంత్రించవచ్చని ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ అంశాలను ప్రభుత్వానికి నివేదించాలమని చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.