పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటి నుంచి వచ్చే 24 గంటల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం