హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించే హిమాయత్ జలాశయంలో నీటి నిల్వలు క్రమేణా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్లో నీటిమట్టం 1,763.5 అడుగులుగా ఉంది. ఇంకా 3.5 అడుగులు అయితే జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది.
ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మూసీనది పరివాహక ప్రాంతాల్లోని 100 కుటుంబాలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు.