ETV Bharat / state

"ఆలోచనల్లో కాదు... ఆచరణలో చూపించారు"

అనాథ పిల్లలకు తమవంతు సాయం చేయాలనుకున్నారు... అనుకున్నదే తడవుగా వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. అనాథ పిల్లలకు తమకు తోచినంత సాయం చేశారు హైదరాబాద్​లోని కూకట్​పల్లి శాతవాహననగర్​ కాలనీ వాకర్స్​ అసోసియేషన్​ సభ్యులు.

walkers
author img

By

Published : Mar 31, 2019, 7:18 PM IST

Updated : Mar 31, 2019, 7:50 PM IST

అనాథ పిల్లలకు... వాకర్స్​ అసోసియేషన్​ చేయూత
మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ... ఉన్నదాంట్లో తమకు చేతనైనంత సాయం చేయాలనుకున్నారు వారు. కేవలం అనుకోవడమే కాక.. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. హైదరాబాద్​లోని కూకట్​పల్లి శాతవాహన నగర్​ కాలనీ వాకర్స్​ అసోసియేషన్​ సభ్యులంతా కలిసి అనాథ పిల్లలకు చేయూతనిచ్చారు.

చేతనైనంత చేయూత

తమకు చేతనైనంత డబ్బు సమకూర్చి.. కుత్బుల్లాపూర్​ సుభాష్​నగర్​లో ఉన్న కృపా చిల్డ్రన్స్​ హోమ్​కు అందించారు. ఆశ్రమానికి ఆరు నెలల పాటు అద్దె, పిల్లలకు కావాల్సిన నిత్యావసర సరుకులు సమకూర్చారు.

ప్రతినెల సాయం చేస్తాం

50 మందికి పైగా ఒక్కటై.. పిల్లలకు నిత్యావసర వస్తువులు, బట్టలు అందజేశారు. ఆరు నెలల పాటు ఆ చిన్నారులకు అవసరమైన అన్ని వసతులను తామే కల్పిస్తామని వాకర్స్​ అసోసియేషన్​ సభ్యులు హామీ ఇచ్చారు. ప్రతి నెల తమకు తోచినంత సేవా కార్యక్రమాలను చేయాలని నిశ్చయించుకొని మానవహారాన్ని నిర్వహించారు.

ఇవీ చూడండి:మోదీని కలిసిన పొంగులేటి సుధాకర్​ రెడ్డి

Intro:Body:Conclusion:
Last Updated : Mar 31, 2019, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.