ప్రజాస్వామ్యంలో గ్రామాలే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఓటు హక్కు వినియోగంలో పట్టణాల కన్నా పల్లెలే ముందుంటున్నాయి. గ్రామాల్లో నిరక్షరాస్యులకుండే సోయి నగరవాసులకు ఇసుమంతైనా లేదు. ఓటు వేసేందుకు చదువుకున్నవాళ్లే బద్దకిస్తున్నారు. పల్లెల్లో ఓటింగ్ జోరుమీదుంటే..పట్టణాల్లో జోగుతోంది. అవునూ..కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఎందుకింత నిర్లక్ష్యం..?
విజ్ఞానవంతులారా మీ చైతన్యం ఎక్కడుంది..?
పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజలు విజ్ఞానవంతులని, మేధావులనీ అనుకుంటాం. ఇలాంటి.. విజ్ఞానవంతులు, మేధావులే ఓటు హక్కుకు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత సనసభ, లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లకెంత బద్దకమో మరోసారి తేలింది. పోలింగ్ శాతం చూస్తే గుండె తరుక్కుపోతోంది. అవునూ... పురపాలిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 70 శాతం నమోదైంది. అందులో పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణం. కేవలం --మాత్రమే పోలింగ్ జరిగింది.
సెలవు ఉన్నా ఇంటి నుంచి కాలు కదపరు..
ఓటింగ్ రోజు సెలవు ఉంటుంది. కానీ కాలు కదపరు. ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ టైంపాస్ చేస్తారే తప్ప..గడప దాటారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి లైన్లో నిలబడి ఎవరు ఓటేస్తారనే బద్దకం..! నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం..! ఓటు వేసేందుకు ముందుకు రారు కానీ..రోడ్లు బాగాలేవు, నీళ్లు రావడం లేదంటూ ప్రభుత్వాలపై నోటికొచ్చింది కూస్తారు. ఓటు వేయలేనివారికి అడిగే హక్కేలేదు.
ఇవీ చూడండి: కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు