Voter Enrollment in Telangana 2023 : ఓటు హక్కు దేశ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. ఇది దేశ భవిష్యత్తును మార్చే అస్త్రం. భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు ద్వారా.. ప్రభుత్వాలు, పాలకులను ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. పాలకులు ఎంపికలో ప్రతి ఓటు కీలకమే.. నేను ఓటు వేయకపోతే ఏమీ కాదులే అనుకోకండి. ఆ ఒక్క ఓటే మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ ఒక్క ఓటే దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే.. నాయకుణ్ని ఎన్నుకుంటుంది.
Youth Voter Enrollment in Telangana 2023 : ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఎలక్షన్ల నిర్వహణకు అధికార యంత్రాంగం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటరు నమోదుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో నమోదు చేసుకోని వారు.. ఇప్పుడు ఓటు హక్కును పొందవచ్చు.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు యువ ఓటర్లకు ఇదే చివరి అవకాశం. అసెంబ్లీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటేయాలనే సంకల్పంతో భారత ఎన్నికల సంఘం ఈ అవకాశమిచ్చింది. ఈనెల అక్టోబరు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం యువ ఓటర్లు.. ఓటరు నమోదుపై ఆసక్తి చూపుతున్నారు.
కొత్తగా ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు, మార్పులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్రాలను ఏర్పాటుచేసి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకునేవారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అధికారులు ఎలక్షన్ల నిర్వహణ పనుల్లో తలమునకలయ్యారు.
Voter Enrollment Helpline : దీంతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ.. ఓటు హక్కు కోసం మీసేవ కేంద్రాల్లో లేదా ఓటర్ హెల్ప్‌లైన్ ద్వారా నమోదు చేసుకొనే అవకాశం ఇచ్చారు. ఓటరు నమోదులో సందేహాల నివృత్తికి 1950 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా కాల్ సౌకర్యం కల్పించారు. ఇంకా ఆలస్యం దేనికి ఓటు హక్కులేని వారందరూ.. దరఖాస్తు చేసుకోండి.
బ్రిటీష్‌వారు హేళన చేసినా.. ఆ విషయంలో మనదైన ముద్ర!
How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు