ETV Bharat / state

కేబుల్​ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులకు అనుమతి

అట్టహాసంగా ప్రారంభమైన దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. కేబుల్ బ్రిడ్జి పై నేడు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ ఏర్పాటు చేశారు.

Visitors are allowed on the cable bridge from today
కేబుల్​ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులకు అనుమతి
author img

By

Published : Sep 26, 2020, 6:41 AM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. కేబుల్ బ్రిడ్జి పై నేడు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ ఏర్పాటు చేశారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. ఉత్తర సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్​ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా ఈ బ్యాండ్ ప్రదర్శన ఉండనుందని ఆయన వివరించారు. 45 నిమిషాల పాటు ప్రదర్శన ఉంటుందని.. వందేమాతరంతో ప్రారంభించి పలు దేశ భక్తి గీతాలు, భారతీయ, పాశ్చాత్య గీతాలు, సంగీతాన్ని ప్రదర్శించి “జయహోతో ముగింపు తెలపనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.