ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జాతీయ క్రీడా దినోత్సవం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. వైఎస్ క్రీడా ప్రోత్సాహకాల పేరిట జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో క్రీడాశాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సానియామీర్జా ఫొటోలతో ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల కింద పీటీ ఉష పేరు రాయడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్లైక్సీలను విశాఖ బీచ్‌రోడ్డులో ప్రదర్శనకు ఉంచడంతో అది వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్ అయ్యేదెవరు..?