దిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘటన అప్రజాస్వామికమైందని..ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మిలియన్ మార్చ్ నిర్వహించిన ముస్తాక్‌పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలన్నారు.
రైతులకు సంక్షేమ పథకాలు అందాలని ఈ నెల 8న జాతీయ స్థాయిలో రైతుబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికలకు రెండు కమిటీలు వేసినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. ప్రతిపక్షాలను బలహీన పర్చాలని వార్డుల విభజన చేశారని కోదండరామ్ ఆరోపించారు.
ఇదీ చూడండి : తప్పిపోయిన బాలుడు.. 5 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు...