Vijay Devarakonda: బాలల దినోత్సవంను పురస్కరించుకుని పేస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని సినీనటుడు విజయ్ దేవరకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఆయన ఆవిష్కరించారు. కాలేయ సమస్యలపై చాలామందికి సరైన అవగాహన ఉండటం లేదని విజయ్ దేవరకొండ తెలిపారు. ముఖ్యంగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడినప్పుడు సరైన సమయానికి గుర్తించి చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం కాలేయ వ్యాధులను జయించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
"మాములుగా మధ్యతరగతి కుటుంబంలో ఎక్కువగా డాక్టర్ దగ్గరకి వెళ్తే ఖర్చు ఎక్కువగా అవుతుందని డాక్టర్ దగ్గరకి వెళ్లేందుకు దూరంగా ఉంటారు. ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటే సరిపోతుందని అనుకుంటాం. పిల్లల ఖర్చులు, ఇంట్లో ఖర్చులు ఉన్నాయని ఆస్పత్రులకు వెళ్లడానికి దూరంగా ఉంటాం. కొన్ని సార్లు తొందరగా అనారోగ్యానికి ఏదైనా కారణం ఉంటే గుర్తించవచ్చు. తద్వారా సరైన చికిత్స పొందవచ్చు. డాక్టర్ ఇప్పుడే చెప్పారు జరిగిన చాలా సర్జరీలు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగిందని చెప్పారు." - విజయ్ దేవరకొండ, సినీనటుడు
ఇవీ చదవండి: విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్‌రెడ్డి
క్యాన్సర్‌పై 'ఐరన్‌మ్యాన్' IPS విజయం.. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌లోనూ..