విజ్ఞాన్ విద్యా సంస్థల విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటారు. 100% ఉత్తీర్ణత సాధించినట్లు విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ ఛైర్ పర్సన్ రాణి రుద్రమదేవి తెలిపారు. శ్రేష్ట అనే అమ్మాయికి 500 మార్కులకు 490 వచ్చినట్లు చెప్పారు. 30 మంది విద్యార్థులు 470 మార్కులకు పైగా సాధించారని పేర్కొన్నారు.
ప్రతి ముగ్గురిలో ఒకరికి 85 శాతం మార్కులు రావడం వల్ల విజ్ఞాన్ మార్గదర్శిగా నిలిచిందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల నిరంతర కృషితోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. తమ పాఠశాలలో వ్యక్తిత్వ వికాసం, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు చదువులో రాణించేందుకు ప్రణాళికాబద్ధమైన బోధన విద్యా విధానం ఉందన్నారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!