ETV Bharat / state

Notification of Forest Block Officer in TS : 'త్వరలోనే అటవీ శాఖలో ఖాళీల భర్తీ' - Vacancies in Forest Department

Notification of Forest Block Officer : అటవీ శాఖ పనితీరు, పురోగతిపై సచివాలయంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఉన్నత అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, రికార్డు స్థాయిలో కొత్త ఫారెస్ట్​ బ్లాక్​ల నోటిఫికేషన్​ తీస్తామని చెప్పారు.

Indrakaran Reddy Review meeting
Indrakaran Reddy Review meeting
author img

By

Published : May 27, 2023, 8:10 PM IST

forest officers notification in TS : రాష్ట్ర ప్రభుత్వం అడవుల రక్షణ, పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, రికార్డు స్థాయిలో కొత్త ఫారెస్ట్ బ్లాక్‌ల నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అటవీశాఖ పనితీరు, పురోగతిపై సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం పర్యావరణ రక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శాఖా పరంగా అన్ని రంగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు రావటం సంతోషకరమని మంత్రి అన్నారు. బీడీ కార్మికులకు సేకరణ ఛార్జీలు, బోనస్ అన్​లైన్ ద్వారా నేరుగా ఖాతాలకు చెల్లింపు ప్రక్రియను అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.

Forest Deportment Jobs Notification in TS : సుమారు లక్ష మంది లబ్దిదారులకు రూ.220 కోట్లు బోనస్​ను చెల్లించటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులకు అటవీ భూములను వినియోగించుకున్నప్పుడు.. ప్రత్యామ్నాయ భూముల్లో కంపా నిధుల ద్వారా అడవులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ రకంగా 135 కొత్త అటవీ బ్లాక్​లను అభివృద్ధి చేస్తూ, సుమారు 14 వేల ఎకరాల అడవిని సృష్టించటంతో పాటు, ఆ అటవీ బ్లాక్​లను ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయటం ఒక రికార్డని మంత్రి అన్నారు.

Discussion on forest crimes : నిర్మల్​లో నెలకొల్పిన స్టెరిలైజేషన్ సెంటర్ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని మంత్రి సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపాలని పీసీసీఎఫ్​ను కోరారు. కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు పురోగతి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో టైగర్ కారిడార్ల విసృతిపై చర్చించారు. అటవీ నేరాల అదుపులో కఠినంగా ఉండాలని, అవసరం అయితే పోలీసు శాఖతో సమస్వయం చేసుకుని పీడీ కేసులు పెట్టాలని సూచించారు.

Telangana Green Festival starting date : అటవీ శాఖలో ఖాళీల భర్తీని టీఎస్​పీఎస్సీతో సంప్రదింపుల ద్వారా త్వరగా రిక్రూట్​మెంట్ జరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీలున్న అన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతమైన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. శాఖా పరంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, పదేళ్ల ప్రగతిని అన్ని వర్గాలకు వివరించాలని, జూన్ 19 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ హరితోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఆలయ భూముల పరిరక్షణ, భక్తులకు సౌకర్యాలు, ధూపదీప నైవేద్యం, కామన్ గుడ్ ఫండ్ తదితర అంశాలపై సమీక్షించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.