హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ప్రజల పట్ల చులకన భావాన్ని... అభివృద్ధి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ఉపఎన్నికల్లో తెరాసను గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని.. సైదిరెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యం చేశారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తనను ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ నియోజవకవర్గం సరిహద్దులు కూడా తెలియవని తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విమర్శించారు.
'ఉత్తమ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ ఎల్లలు కూడా తెలవదు' - గులాబీ జెండా
హుజూర్నగర్ గడ్డమీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తెరాస అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించి ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు.