రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్ తమిళిసైకు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ రాశారు. శాసన మండలి ఛైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి హుజూర్నగర్ ఉపఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలకీడు జడ్పీటీసీ సభ్యుడు మోతీలాల్ నాయక్, సర్పంచి జితేందర్ రెడ్డిని... ఫిల్మ్ ఛాంబరులోని తన ఇంటికి పిలిపించుకుని పెద్దమొత్తంలో డబ్బు ఆశచూపి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అదేవిధంగా పలువురు కాంగ్రెస్ నేతలను కూడా పిలుస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుమారుడు అమిత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టులో 15వ ప్యాకేజీకి సంబంధించి రూ.719 కోట్లు విలువైన పనులను, ఆయన బంధువుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు చెందిన రెండు ప్యాకేజీల కింద 37వేల కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లు ఆరోపించారు. హుజూర్నగర్లో ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఆంధ్ర వ్యక్తికి హుజూర్నగర్ టికెటెలా ఇచ్చారు?: ఉత్తమ్