విదేశీ విద్యపై అనుమానాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో... యూఎస్ రాయబార కార్యాలయం అమెరికాలో చదువుకోవాలనుకునే ఆశావహుల కోసం వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 10 వరకు జరగనున్న ఈ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ మేళాలో 150 వరకు అమెరికన్ విశ్వవిద్యాలయాలు పాల్గోనున్నాయి.
ఆసక్తి గల భారతీయ విద్యార్థులు ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొని దరఖాస్తు, స్కాలర్ షిప్స్, అడ్మిషన్‌కు సంబంధించిన తదితర వివరాలు తెలుసుకోవచ్చని హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
ఇదీ చూడండి: 'సంగీత ప్రపంచంలో ఘంటసాల సూర్యుడైతే.. బాలు చంద్రుడు'