ETV Bharat / state

shilpa chowdary cheating case: శిల్పాచౌదరికి మరోరోజు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు - శిల్పా చౌదరి చీటింగ్​ కేసు

shilpa chowdary
shilpa chowdary
author img

By

Published : Dec 13, 2021, 2:53 PM IST

Updated : Dec 13, 2021, 10:41 PM IST

14:42 December 13

shilpa chowdary cheating case: శిల్పాచౌదరికి మరోరోజు కస్టడీ.. అనుమతిచ్చిన ఉప్పర్‌పల్లి కోర్టు

Shilpa chowdary cheating case: పెట్టుబడుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 కేసుల్లో 7 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. మూడురోజుల కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు... వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇవాళ ఆమెను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు... మరో రెండు రోజులు కస్టడీ కోరగా... ఒకరోజు కస్డడీకి న్యాయస్థానం అనుమతించింది. ఇప్పటికి రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్లు చెప్పిన శిల్ప... అందుకు తగు ఆధారాలు ఇవ్వలేకపోయింది.. కోర్టు ఆదేశాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆమెను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ఇవాళ శిల్పా చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఐదురోజుల కస్టడీలోనూ ఆమె నుంచి పోలీసులు వివరాలు రాబట్టలేకపోయారు. రెండోసారి కస్టడీకు తీసుకున్నపుడు రెండో శనివారం, ఆదివారం సెలవులు కావటంతో బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించలేకపోయామంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో ఒక్కరోజు కస్టడీకు అనుమతినిచ్చింది. మంగళవారం ఆమె నుంచి బ్యాంకు లావాదేవీలు, లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించనున్నట్టు సమాచారం.

Shilpa chowdary police custody: 3 కేసుల్లో 7 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. మూడ్రోజుల కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు... వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మొదటిసారి పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెప్పినట్లు సమాచారం.

పొంతన లేని సమాధానాలు

కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా మళ్లించేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు శిల్ప చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్న వారు కూడా.. తామూ బాధితులమే అంటున్నారు. దీంతో కేసు గందరగోళంగా మారింది. మొత్తంగా నిందితురాలు శిల్ప పలువురిని మోసం చేసి వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎక్కడకు మళ్లించిందనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్లు చెప్పిన శిల్ప... ఆధారాలు ఇవ్వలేకపోయింది. దీంతో నిందితురాలిపై మరో కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తిరిగిచ్చేస్తానని చెప్పింది

ప్రస్తుతం శిల్ప ఖాతాలో రూ.16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14వేలను పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటివరకు కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఫిర్యాదు చేసిన ముగ్గురికి వారిచ్చిన డబ్బు రూ. 7 కోట్లను తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్ప రూ. 7 కోట్లకుపైగా తీసుకుని ఎగవేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శిల్ప పనిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె అమెరికా నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10 కోట్లకుపైగా డబ్బులు ఇచ్చినట్టు శిల్ప చెప్పినప్పటికీ తగిన ఆధారాలు ఇవ్వలేదు. శిల్పాచౌదరి మోసాలపై మరిన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి: Shilpa Chowdary Police Custody: రూ.7కోట్లు తిరిగిచ్చేస్తా.. పోలీసుల విచారణలో శిల్పా చౌదరి

Last Updated : Dec 13, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.