ఇవీ చూడండి:ఐదోసారి మహిళా ఫుట్బాల్ టైటిల్ భారత్ కైవసం
ఉప్పల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల క్రీడాసందడి
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్ కదా ఏ జట్ల మధ్య పోటీయో అనుకుంటే పొరపాటే. పనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహంగా గడిపారు.
ఉప్పల్ మైదానంలో ఆడుతున్న లాయర్లు
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలానే ఈసారి క్రీడాపోటీలు నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కలిసి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ ఆడారు. ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ హాజరై... జట్టుకు సారథ్యం వహించారు. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనలు ఉంటాయని... ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల నూతనుత్తేజంతో పని చేస్తామని అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ క్రీడల వల్ల న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని లాయర్లు అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి:ఐదోసారి మహిళా ఫుట్బాల్ టైటిల్ భారత్ కైవసం
sample description