Unknown persons follow to pawan: పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద తిరుగుతున్నారని చెప్పారు. పవన్ ఇంటి నుంచి వెళ్లినపుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. పవన్‌ను అనుసరిస్తున్నది.. ఆయన అభిమానులు కాదన్న నాదెండ్ల మనోహర్.. వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని చెప్పారు.
మంగళవారం బైకులపై, ఇవాళ కారులో అనుసరించారని వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి తమ అధినేత ఇంటి వద్ద ముగ్గురు గొడవ చేశారన్న మనోహర్.. భద్రతా సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగారని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడారని వివరించారు. ఘటనను భద్రతా సిబ్బంది వీడియో తీసినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
ఇవీ చదవండి: