కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గాంధీ ఆసుపత్రిలో కరోనా రెండో టీకాను తీసుకున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. టీకాపై అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు కిషన్ రెడ్డి. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మందులు, పడకల సమస్య రాకుండా చూడాలని సూచించారు.
ఇదీ చదవండి: వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయొద్దు: ఈటల