ETV Bharat / state

విద్యుత్ రంగానికి రాయితీలకు రూ. 10 వేల కోట్లు - telangana budget 2020 updates

విద్యుత్ రంగానికి బడ్జెట్​లో భారీగా నిధుల కేటాయింపులు జరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 10 వేల కోట్లను రాయితీల కింద ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2019-20లో రూ. 8 వేల కోట్లను కేటాయించగా, ఈసారి కేటాయింపుల్లో మరో రూ. 2 వేల కోట్లను పెంచింది.

Under the concession to the power sector Rs. 10 thousand crore in telangana budget 2020-21
విద్యుత్ రంగానికి రాయితీలకు రూ. 10 వేల కోట్లు
author img

By

Published : Mar 8, 2020, 8:38 PM IST

రాష్ట్రంలో విద్యుత్ రంగానికి బడ్జెట్​లో నిధుల కేటాయింపులు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 10 వేల కోట్లను రాయితీల కింద ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2019-20లో రూ. 8 వేల కోట్లను కేటాయించారు. డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించకుండా సరఫరా చేయడానికి డిస్కంలు పెద్ద ఎత్తున విద్యుత్​ను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం రోజువారి విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లకు చేరింది.

సగటు యూనిట్​ వ్యయం రూ. 7

రాష్ట్రంలో 24.12 లక్షల వ్యవసాయ బోర్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేసేందుకు ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయి. ఈఏడాది ఎత్తిపోతల పథకాలకు గరిష్టంగా రోజూ వారి 2,200ల మెగావాట్ల డిమాండ్ ఉంది. ఈ పథకాలకు నీటిపారుదల శాఖ నుంచి కూడా డిస్కంలకు నిధులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో కరెంట్ సరఫరాకు యూనిట్​కు సగటు వ్యయం రూ.7 అవుతోంది. పేదలకు 100 యూనిట్లలోపు వాడే వారికి యూనిట్​ను రూ. 1.45 లకే డిస్కంలు అందజేస్తున్నాయి.

ఆదాయ, వ్యయాల మధ్య అంతరం

సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య వచ్చే అంతరం ఏడాదికి రూ. 11 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. దాన్ని పూడ్చుకునేందుకు ఛార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. ఇప్పటికే డిస్కంలు రూ. 6 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ బకాయిలు రూ. 7 వేల కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని అందజేయాలని అన్ని శాఖలకు డిస్కంలు కోరుతున్నాయి. 2020-21లో విద్యుత్ రాయితీలకు మొత్తంగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. అందులో జనరల్ కేటగిరికి రూ. 7,547 కోట్లు, ఎస్సీ కేటగిరికి రూ. 1,545 కోట్లు, ఎస్టీ కేటగిరికి రూ. 908 కోట్లు కేటాయించారు.

ఇదీ చూడండి : 'పబ్లిక్​ లీడర్​ ఇల్లు చూడొద్దా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.