ETV Bharat / state

BJP Protest Against Udayanidhi Stalin : 'బీజేపీ విషసర్పం'.. ఉదయనిధి వ్యాఖ్యలపై కాషాయ నేతలు ఫైర్

Udayanidhi Stalin On Sanatana Dharma BJP Reaction : సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆపై బీజేపీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై డీఎంకే, కమలం పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నేత మాల్తుంకర్ కరణ్ ఆధ్వర్యంలో.. ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

Udhayanidhi Stalin Statement
Udhayanidhi Stalin On BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 1:43 PM IST

Udayanidhi Stalin On Sanatana Dharma BJP Reaction : సనాతన ధర్మం, బీజేపీపై.. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా కమలం శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని మాసాబ్‌ట్యాంక్‌ చౌరస్తా వద్ద ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, నాంపల్లి ఎమ్మెల్యే ఆశావాహ అభ్యర్థి మాల్తుంకర్ కరణ్ (Malthunkar Karan)పాల్గొన్నారు.

Malthunkar Karan Fires on Udayanidhi Stalin : డీఎంకే పార్టీ, తమిళనాడు ప్రభుత్వ విధానాలపైనా మాల్తుంకర్ కరణ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీని తిడితే తమిళనాడుకు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలని.. ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అక్కడ డీఎంకే అడ్రస్ గల్లంతు చేస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీలోనే ధైర్య సాహసాలు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుందని అన్నారు. అలాంటి బీజేపీని విషసర్పంతో పోల్చడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమేనని మాల్తుంకర్ కరణ్ చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Udhayanidhi Stalin Santana Dharma : సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్​

అసలేం జరిగిదంటే : తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది కాస్తా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం కాకుండా దాని నిర్మూలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సనాతనం అంటే సమానత్వం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం తప్ప మరొకటి కాదని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.

Udayanidhi Stalin On Sanatana Dharma : సనాతనం అంటే శాశ్వతమైనదని, అది ప్రజలను కులాల వారీగా విభజిస్తుందని ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. తన తాత, దివంగత సీఎం కరుణానిధి అన్ని కులాల వారు ఆలయ పూజారులు అయ్యేందుకు చట్టం తెచ్చారని.. తన తండ్రి, ప్రస్తుత సీఎం స్టాలిన్‌ అర్చక శిక్షణ పొందిన అన్ని కులాల వారిని ఆలయ పూజారులుగా నియమించారని గుర్తుచేశారు. ద్రవిడ నమూనా అంటే ఇదేనని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Udhayanidhi Stalin Statement : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. వారసత్వ గర్వమేనన్న అమిత్ షా

Sanatana Dharma Row : సనాతన ధర్మంపై DMK ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. చర్చకు రావాలని బీజేపీ నేతలకు సవాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.