ETV Bharat / state

వృద్ధురాలిపై దాడిచేసిన దొంగల అరెస్ట్ - TWO THIEVES ARRESTED

ఇంట్లోకి వస్తున్న దొంగలపై ప్రతిఘటించిన వృద్ధురాలిపై దాడి చేసి పరారైన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరొకరి కోసం నేపాల్​లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

two thieves arrest
వృద్ధురాలిపై దాడిచేసి పరారైన దొగంల అరెస్ట్
author img

By

Published : Mar 10, 2020, 3:29 PM IST

గత నెలలో పంజాగుట్ట పోలీస్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ముగ్గురు మహిళలు ఉంటున్న ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న వృద్ధురాలిని సుత్తితో తలపై మోది పరారయ్యారు. ఈ కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ కేసులో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బృందాలుగా విడిపోయి థానేకి చెందిన నాథురాం, వాజిరాంలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం నేపాల్​లో గాలిస్తున్నారు.

వృద్ధురాలిపై దాడిచేసి పరారైన దొగంల అరెస్ట్

ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.