ETV Bharat / state

ఫలితం తేలక.. ఆవేదన తీరక మనోవ్యధ - Corona latest news

తెలంగాణ రాజధానిలో కరోనా అనుమానితులు మనోవ్యధ అనుభవిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షా ఫలితాలు రోజుల తరబడి ఆలస్యమవడమే దీనికి కారణం. ప్రధానంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకున్న వారు నివేదిక కోసం కనీసం రెండు రోజులు ఆగాల్సి వస్తోంది. ఈలోపు తమకు కరోనా ఉందో లేదోనన్న విషయం తెలియక సంబంధిత అనుమానితులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితం వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకుందాంలే అనే ధోరణిలో కొంతమంది ఇంట్లోనే అందరితో కలిసి ఉంటున్నారు. అటువంటి ఇళ్లలో రోగుల సంఖ్య పెరుగుతోంది. పరీక్షల సంఖ్య పెరగడం వల్లే కొన్ని కేంద్రాల్లో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.

rtpcr report, corona
ఫలితం తేలక.. ఆవేదన తీరక
author img

By

Published : Mar 28, 2021, 8:29 AM IST

గతేడాది హైదరాబాద్ మహానగరాన్ని హడలెత్తిన కరోనా వైరస్‌ నాలుగైదు నెలలుగా కొంత తగ్గుముఖం పట్టింది. నెల రోజులుగా మళ్లీ మెల్లగా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 495 మంది కొవిడ్‌ బారిన పడగా అందులో 80 శాతం మంది హైదరాబాద్‌, పరిసర జిల్లాల వారే. నగరంలో 33 చోట్ల, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌ జిల్లాలో 23 ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. నెలరోజుల కిందటి వరకు రాజధానిలో రోజుకు 15 వేలకుపైబడి (ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌)పరీక్షలు మాత్రమే చేసేవారు. కొద్ది రోజులుగా ఈ సంఖ్య దాదాపు 45 వేలకు చేరింది.

రెండు వారాల క్రితం యాంటీజెన్‌ ర్యాపిడ్‌ పరీక్షలనే అధికంగా చేయించుకునేవారు. అయితే దీనిలో ఖచ్చితమైన ఫలితాలు రావడం లేదు. ఇటీవల రాజేంద్రనగర్‌లోని ఒక హాస్టళ్లో 100 మంది విద్యార్థులకు ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా అందులో 33 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. తరువాత అదే విద్యార్థులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే కొవిడ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో అనేకమంది ఒకరోజు ఆలస్యమైనా కూడా ఆర్టీపీసీఆర్‌ చేయించుకోవడానికే ఇష్టపడుతున్నారు. మనకున్న సాంకేతిక సంపత్తి ప్రకారం చూస్తే.. పరీక్ష చేసిన ఆరు గంటల్లో ఈ ఫలితాలను ప్రకటించొచ్ఛు.

కానీ 40 గంటలైనా రావడం లేదు. టెస్ట్‌ల సంఖ్య పెరగడం.. సంబంధిత ఆస్పత్రిలో సిబ్బంది కొరత మరో కారణమని చెబుతున్నారు. నిమ్స్‌లో నెలరోజుల కిందటి వరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు రోజుకు 150 మందికి చేసేవారు.. ఇప్పుడు 600లకుపైన చేస్తున్నారు. ఒక్కసారిగా మూడింతలకు పైగా పెరగడంతో వెంటవెంటనే రిపోర్టులు ఇవ్వలేని పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో మాత్రం ఏ రోజు పరీక్ష చేస్తే ఆరోజు సాయంత్రానికి ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వారు సైతం రిపోర్టు రాలేదు కాబట్టి.. వచ్చిన తరువాతే వేరే గదిలో ఉందామన్న ఉద్దేశంతో అందరితో కలిసి ఉంటున్నారు. నివేదిక వచ్చేటప్పటికే ఆ ఇంట్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.