తిరుమలలో కరోనా వ్యాప్తి చెందకుండా తితిదే అన్ని చర్యలు చేపట్టింది. వైరస్ భయంతో తిరుమలకు రాలేని భక్తుల దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, గదులు రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టికెట్లు రద్దు చేసుకోవాలనుకునేవారు dyeotemple@gmail.com మెయిల్ ద్వారా తమను సంప్రదించాలని అధికారులు కోరారు.
థర్మల్ గన్ ద్వారా పరీక్షలు
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను థర్మల్ గన్ ద్వారా అధికారులు పరీక్షించనున్నారు. ఇందుకోసం అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు, నడక మార్గాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో ఉన్న వారు తిరుమలకు రావద్దంటూ తితిదే భక్తులకు విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌పై వీడియోల ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: