వికారాబాద్ జిల్లా తాండూర్లో ఆర్టీసీ కార్మికులు గాంధీగిరి చేశారు. తాత్కాలిక డ్రైవర్ల కాళ్లు పట్టుకుని విధులకు హాజరుకావొద్దని వేడుకున్నారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని గులాబీ పువ్వులు ఇచ్చి వారిని కోరారు. ప్రభుత్వం మాటలు విని తమ కడుపు కొట్టవద్దంటూ తాత్కాలిక సిబ్బందికి ఆర్టీసీ కార్మికులు మొరపెట్టుకున్నారు. సంస్ధను బతికించుకోవడానికి తాము న్యాయపరంగా ముందుకు వెళితే ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష