ఆర్టీసీ ప్రైవేటీకరణ(RTC PRIVATIZATION) విషయంలో నూతన ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ప్రకటనపై ఆర్టీసీ జేఏసీ(RTC JAC) ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించకుండానే నాలుగు నెలల్లో లాభాలు రాకపోతే ప్రైవేటుపరం చేస్తామని చెప్పడమేంటని మండిపడింది. ఆర్టీసీ యాజమాన్యం తీరును నిరసిస్తూ హైదరాబాద్ బస్ భవన్(BUS BHAVAN) ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు.
సంస్మరణ దినోత్సవంగా
వచ్చే నెల నుంచి ఆర్టీసీ కార్మికులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) ఛైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఇచ్చే అడ్వాన్స్‌ను చెల్లించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ, ఛైర్మన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కార్మికుల సంక్షేమాన్ని ఆలోచించాలని కోరారు. అక్టోబరు 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల్లో అమరవీరుల ఫొటోల బ్యానర్లతో ఆర్టీసీ పరిరక్షణ దినోత్సవం- అమరులు సంస్మరణ దినోత్సవంగా పాటించాలని కార్మికులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆర్టీసీ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నిరసనగా అక్టోబరు 7న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడుతున్నట్లు రాజిరెడ్డి(RTC JAC) తెలిపారు. ఈ ఉద్యమంలో ఇతర యూనియన్లు కూడా కలిసి రావాలని కన్వీనర్ బీఎస్ రావు విజ్ఞప్తి చేశారు. బస్‌భవన్ ఎదుట చేపట్టిన నిరసనలో ఆర్టీసీ జేఏసీలోని ఎంప్లాయిస్ యూనియన్, టీజేఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్డబ్ల్యుయు, బీకేయూ, బిడబ్ల్యుయు తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసలేం జరిగిందంటే
రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ(tsrtc latest news) గాడిన పడకపోతే ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇదే విషయాన్ని గతంలో జరిగిన సమీక్షా సమావేశం(tsrtc latest news)లో సీఎం కేసీఆర్....రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్లకు స్పష్టంచేశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేకసార్లు ఆదుకుందని.. ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద మూడు వేల కోట్లు కేటాయించిందని.. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనాతో ఆర్థిక నష్టం
ఇటీవలే ఆర్టీసీకి ఛైర్మన్‌ను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్... సంస్థను గాడినపెట్టేందుకు చర్యలు చేపట్టారు. మరో నాలుగు నెలల్లో ఆర్టీసీని గాడిన పెట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టి సంస్థను గాడినపెట్టాలని కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనాతో పాటు పెరిగిన డీజీల్ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టీసీ(Rtc)ని నష్టాల నుంచి లాభాల బాటలోకి తేకపోయినా.. నష్టాలయినా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని గతంలో బాజిరెడ్డి పేర్కొన్నారు. కరోనా (Corona) వల్ల ఆర్టీసీ (Rtc) తీవ్రంగా నష్టపోయిందని.. గతంలో రోజూ రూ.14కోట్ల ఆదాయం వస్తే.. కరోనా వల్ల కేవలం రూ.3కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. పక్క రాష్ట్రాల్లో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని.. తెలంగాణలో మాత్రం ఆలస్యమైనా చెల్లించామని చెప్పారు. బడ్జెట్లో రూ.3వేల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: Bjp Meeting: అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో భాజపా భారీ బహిరంగ సభ