హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సామూహిక నిరాహార దీక్షను చేపట్టారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2017 ఏప్రిల్ నుంచి రావాల్సిన జీతభత్యాల సవరణను వెంటనే చేయాలని కోరుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నామని కార్మికులు తెలిపారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు