ETV Bharat / state

TSRTC Bus Charges 10 percent Discount : సూదూర ప్రాంతాలు ప్రయాణించేవారికి.. టీఎస్​ఆర్టీసీ గుడ్​ న్యూస్ - hyderabad to bengalur bus charge

TSRTC 10 Percent Discount on Bus Ticket : దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకి టీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్​ నుంచి విజయవాడ, బెంగళూరు రూట్​లలో టికెట్​పై 10శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనుంది.

TSRTC Bus Charges 10 percent Discount
TSRTC Bus Charges 10 percent Discount
author img

By

Published : Jul 1, 2023, 8:54 PM IST

TSRTC offers 10 per cent discount on Bengaluru -Vijayawada routes : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు, విజయవాడ రూట్‌లలో టికెట్​పై 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్​ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో జున్​ 2 నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే మాత్రమే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది.

TSRTC official Website : ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుందని పేర్కొంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.comలో చేసుకోవాలని సూచించారు. 60 రోజులు ఉంటుండగా ముందస్తు బస్సు రిజర్వేషన్​ చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఛార్జీలో రాయితీ ఇవ్వడం వల్ల ప్రయాణికులకి ఆర్థిక భారం తగ్గుతోందని వెల్లడించింది.

TSRTC on Reservation Charges : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ఆ ఛార్జీలు తగ్గింపు

TSRTC Special package to Arunachalam Passenger: ఈ విషయాన్ని టీఎస్​ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ట్విటర్​లో ట్వీట్​ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అరుణాచ‌లేశ్వ‌రుని గిరి ప్ర‌ద‌క్షిణ చేయాల‌నుకునే భ‌క్తుల కోసం తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టిన టూర్ ప్యాకేజీకి అనూహ్య స్పంద‌న వ‌స్తోందని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 30 ప్ర‌త్యేక సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారని.. ఆ సీట్లలన్ని భర్తీ అయ్యాయని వెల్లడించారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌న్నీ జులై 1, 2 తేదీల్లో హైద‌రాబాద్‌తో స‌హా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచ‌లానికి బ‌య‌లుదేరుతాయని ప్రకటించారు. జులై 3న గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా అరుణాచ‌లానికి టీఎస్ఆర్టీసీ రెండు రోజుల టూర్ ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించింది. మొద‌ట కాణిపాకంలోని విఘ్నేశ్వ‌రుని ద‌ర్శ‌నం.. అనంత‌రం అరుణాచ‌లానికి ఈ బ‌స్సులు చేరుకుంటాయి. తిరుగు ప్ర‌యాణంలో గొల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం ఉంటుందని అన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా మొద‌ట ఒక ప్ర‌త్యేక బ‌స్సునే ఏర్పాటు చేయ‌గా.. అనూహ్యంగా డిమాండ్ పెర‌గ‌డంతో స‌ర్వీసుల‌ను సంస్థ పెంచిందని పేర్కొంది.

  • సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ రూట్‌లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని #TSRTC నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు…

    — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.