ETV Bharat / state

TSRTC CHARGES HIKE: త్వరలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపు! - తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు

ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపుపై (TSRTC AND ELECTRICITY CHARGES HIKE)వచ్చే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షలో.... విద్యుత్‌ సంస్థలు, ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రులు, అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఛార్జీల పెంపు కోసం సమగ్ర ప్రతిపాదనల్ని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ వారిని ఆదేశించారు.

TSRTC CHARGES HIKE
TSRTC CHARGES HIKE
author img

By

Published : Sep 22, 2021, 5:35 AM IST

ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల సమస్యలపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రధానంగా చర్చించారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని.. సంస్థ గాడిలో పడుతున్న సమయంలో... కరోనా, డీజిల్‌ ధరల పెంపు భారంతో తిరిగి నష్టాల్లో కూరుకుపోయాయని సీఎం వ్యాఖ్యానించారు.

ఛార్జీలు పెంచక తప్పదన్న మంత్రి, ఆర్టీసీ ఎండీ..

బస్సు ఛార్జీలను పెంచాల్సిందేనని మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. కరోనా సంక్షోభంతోపాటు డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదిన్నరకాలంలో డీజిల్‌ ధరల పెరుగుదలతో రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలతో మరో రూ. 50 కోట్లు కలిపి... ఏటా 600 కోట్ల భారం పడుతోందన్నారు. లాక్‌డౌన్ల వల్ల ఆర్టీసీ సుమారు రూ.3000 కోట్ల మేర నష్టపోయిందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు నష్టం వస్తోందన్నారు. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తెచ్చారు.

మనుగడ సాధ్యం కాదు..

'2020 మార్చిలోనే ఆర్టీసీ ఛార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కరోనా కారణంగా పెంచలేదు. ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై... ఇంకా మీద భారం మోపమనడానికి మాటలు రావడంలేదు. ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తే తప్ప మనుగడ సాధ్యం కాదని' పువ్వాడ అజయ్‌, సజ్జనార్‌ సీఎంకు తెలిపారు.

10 నుంచి 20 శాతం పెరిగే అవకాశం..

ఈ నేపథ్యంలో బస్సు ఛార్జీలు 10 నుంచి 20 శాతం పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈమేరకు అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. 20 శాతం పెంచితే రోజువారీ ఆదాయం 6 నుంచి 7 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. ఏడాదిలో కనీసం 175 రోజులపాటు ఆ మేరకు ఆదాయం వస్తే వెయ్యి కోట్ల వరకు అదనపు ఆదాయం లభించి... ఆర్టీసీ గట్టెక్కుతుందని భావిస్తున్నారు.

విద్యుత్​ బిల్లులు సైతం..

కరోనా నేపథ్యంలో విద్యుత్తు సంస్థలూ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఆరేళ్లుగా ఛార్జీలను సవరించలేదని... విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి ఇప్పుడు పెంచక తప్పదన్నారు. ఆర్టీసీతోపాటు విద్యుత్ అంశాలకు సంబంధించి... వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రుల్ని, సంబంధిత అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీచూడండి: CM KCR Review On RTC: ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నం ప్రారంభమైంది: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.