ETV Bharat / state

ఈ వారంలోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు.. మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే.! - త్వరలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు

Group-1 Prelims Results: రాష్ట్ర తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి... టీఎస్​పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు సహా మెయిన్స్‌ షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఏప్రిల్‌ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది.

Group-1
Group-1
author img

By

Published : Jan 5, 2023, 6:54 AM IST

Group-1 Prelims Results: తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది.

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రాథమిక కీ ప్రకటించి, అభ్యంతరాలు ఆహ్వానించింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగిస్తూ కమిషన్‌ నవంబరు 15న తుది కీ ప్రకటించింది. మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది.

ఒకటికి రెండు సార్లు పరిశీలన : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. మూల్యాంకనం తరువాత ప్రిలిమినరీ ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలను సరిచూస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. అంటే ప్రధాన పరీక్షకు మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనుంది. ఈ మేరకు మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఫలితాలు ఈ వారంలోనే ఇవ్వాలని భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ ముందస్తు ప్రణాళిక ప్రకారం శుక్ర లేదా శనివారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులతో ఆలస్యమైతే సోమవారానికి ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తిచేయనుంది.

ప్రిలిమినరీ మార్కుల గణన ఇలా : గ్రూప్‌-1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించినందున 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించింది. ఉదా।। 145 మార్కులకు 120 వస్తే 150కి లెక్కించి 124.137గా నిర్ణయిస్తారు. ఇలా మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్‌ జాబితాను కమిషన్‌ రూపొందిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.