ETV Bharat / state

TSPSC పేపర్​ లీకేజీ ఘటన.. 13మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - హైదరాబాద్​ వార్తలు

TSPSC Computers Hacked: టీఎస్​పీఎస్సీ నేడు నిర్వహించాల్సిన 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్​ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రశ్నల సాప్ట్‌కాపీ వివరాలు బయటకు రావడంతో పరీక్షను వాయిదా వేశారు. కంప్యూటర్ల హ్యాకింగ్‌ ఉదంతంతో ఈ నెల 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షా వాయిదా పడింది. టీఎస్​పీఎస్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 13మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

TSPSC computers were hacked
టీఎస్​పీఎస్​సీ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి
author img

By

Published : Mar 12, 2023, 7:20 AM IST

Updated : Mar 12, 2023, 10:56 PM IST

TSPSC Town Planning Supervising Officer Paper Leak: పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌ పరీక్షలకు సంబంధిచిన పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం లేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రవీణ్‌ నుంచి పేపర్ కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చిన 13మందిని అదుపులోకి పోలీసులు విచారిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌తో పాటుగా పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దించారు. హ్యాకింగ్‌ జరిగిందని టీఎస్​పీఎస్సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో... సైబర్‌ క్రైం పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. టీఎస్​పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ విచారణలో పలు విషయాలు పోలీసులకు తెలిసినట్లు సమాచారం.

TSPSC Veterinary Assistant Surgeon Paper Leak: ముగ్గురు దళారులతో కలిసి పేపర్ లీకేజీకి కుట్రపన్నాడని ఇందుకోసం 10 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు ప్రాథమికంగా తెలిసింది. పోలీసులు అప్రమత్తం చేయడంతో టీఎస్​పీఎస్సీ పరీక్షల్ని నిలిపి వేసింది. పేపర్ లీక్ అయిందని ఓ అభ్యర్థి పోలీసులకు సమాచారం ఇవ్వగా బేగంబజార్ పోలీసులు టీఎస్​పీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనిఖీ చేసిన అధికారులు వెంటనే పరీక్షను నిలిపివేశారు.

టీఎస్​పీఎస్సీకి సంబంధించిన వెబ్‌సైట్ లాగిన్ వివరాలు.. సంబంధిత అధికారి వద్ద చాలా భద్రంగా ఉంటాయి. ఆ లాగిన్‌ వివరాలతోనే సర్వర్ నుంచి పేపర్లు తస్కరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం ఎంత మంది నిందితులు ఉన్నారనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కొందరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

TSPSC computers hacked: మరోవైపు టీఎస్​పీఎస్​ఎస్సీ పేపర్​ లీకేజీపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా కష్టపడి చదివి చివరకు పరీక్షలకు హాజరైన సమయంలో ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తదుపరి పరీక్ష షెడ్యూల్​ను తక్షణమే​ విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 12, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.