ETV Bharat / state

టెస్కాబ్ ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​ పదవులు ఏకగ్రీవం - tscab president konduri ravindar rao

టెస్కాబ్​ ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​ పదవులకు కొండూరు రవీందర్​రావు, గొంగిడి మహేందర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం వారు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

tscab elections in telangana
టెస్కాబ్​ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఏకగ్రీవం
author img

By

Published : Mar 5, 2020, 4:51 PM IST

టెస్కాబ్ ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​​ పదవులకు కొండూరు రవీందర్​రావు, గొంగిడి మహేందర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో... ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహకార శాఖ ఎన్నికల అథారిటీ ప్రకటించింది. కొత్త ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​ పదవులకు ఎన్నికైన రవీందర్ రావు, మహేందర్ రెడ్డికి, డైరెక్టర్లకు మంత్రి నిరంజన్​ రెడ్డి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో రైతు సమన్వయ సమితిని త్వరలోనే రైతుబంధు సమితిగా మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి తెెలిపారు. రాష్ట్ర బడ్జెట్​లో వ్యవసాయానికి ఏటా 60 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

తొలిసారిగా టెస్కాబ్ పాలకవర్గం ఎన్నికలు ఏకగ్రీవం, ఏకపక్షంగా జరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రెండు పీఏసీఎస్​లకు తప్ప మిగతా 904 సహకార సంఘాలకు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని వివరించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

టెస్కాబ్ ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​ పదవులు ఏకగ్రీవం

ఇవీ చూడండి: 'ఇవి పాటిస్తే కరోనాను వంద శాతం అరికట్టవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.