Ts Government Debt: రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా రాష్ట్ర ఆర్థికశాఖ బాండ్లు జారీ చేసింది. 18, 19 ఏళ్ల కాలానికి రూ.500 కోట్ల చొప్పున బాండ్లను జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన ఆర్బీఐ బాండ్లను వేలం వేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి బాండ్ల విక్రయం ద్వారా రూ.19,500 కోట్లను అప్పుల ద్వారా సమీకరించుకుంది. తాజాగా మరో రూ.వెయ్యి కోట్ల విలువైన బాండ్లు జారీ చేసింది. దీంతో రుణాల మొత్తం రూ.20,500 కోట్లకు చేరనుంది.
ఇదిలా ఉండగా ఆగస్ట్‌లో ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన బాండ్లను 23 ఏళ్ల కాలానికి, మరో రూ.500 కోట్ల విలువైన బాండ్లను 24 ఏళ్ల కాలానికి జారీ చేసి.. రూ.వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
'దాచిపెట్టాల్సిందేమీ లేదు.. పారదర్శకంగానే అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తాం'