కారుణ్య మరణానికి అనుమతులివ్వండి మొన్న గ్రూప్-2 అభ్యర్థులు... పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూసి విసిగిపోయారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు టీఆర్టీ అభ్యర్థుల వంతు. తమ గోడు వినాలంటూ నాంపల్లిలోని హక్కుల సంఘం తలుపు తట్టారు. కనీసం కారుణ్య మరణానికైనా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2018 ఫిబ్రవరిలో టీఆర్టీ పరీక్ష నిర్వహించి 8792 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఫలితాలు విడుదల చేశారని.. ఇప్పటికీ నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపికైన నిరుద్యోగులం...
ఇన్ని రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తమ కుటుంబాలు ప్రస్తుతం రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించకుంటేకారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని కోరారు.
ఇదీ చదవండి :'కాంగ్రెస్లో నాయకత్వ లోపంతోనే పార్టీని వీడాను'