ETV Bharat / state

రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేయడం సరికాదు: రేపాక వెంకటేశ్ గుప్తా - ప్రతిపక్షాలపై టీఆర్​ఎస్​ నేత రాపాక విమర్శలు

ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెరాస సీనియర్ నేత రేపాక వెంకటేశ్​ గుప్తా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ముఖ్యమంత్రి ఆర్యవైశ్యులను కించపరిచారంటూ.. కాంగ్రెస్ నేత కాల్వ సుజాత చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

TRS leader Rapaka criticizes the opposition
ప్రతిపక్షాలపై టీఆర్​ఎస్​ నేత రాపాక విమర్శలు
author img

By

Published : Jun 27, 2021, 1:34 PM IST

వాసాలమర్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులను కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్​ నేత కాల్వ సుజాత ఆరోపించడం సరికాదని తెరాస సీనియర్ నాయకుడు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపాక వెంకటేష్ గుప్తా అన్నారు. వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎంతగానో సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత కల్పించిన నాయకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఆర్యవైశ్యుల జీవన విధానం కంటే ప్రస్తుతం వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని రేపాక వెంకటేష్ గుప్తా అన్నారు. ప్రజల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే సుజాత ముఖ్యమంత్రిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలు చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని సూచించారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఆమె వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఎస్సీ సాధికారతపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.